భారతదేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనదే : సీఎం కెసిఆర్
- November 01, 2017
భారతదేశంలోనే ఇంత చెత్త సచివాలయం లేనే లేదన్నారు కేసీఆర్. అసెంబ్లీలో కొత్త సచివాలయ నిర్మాణంపై బీజేపీ సభ్యుల అడిగిన ప్రశ్నలపై సీఎం స్పందించారు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడ భవనాలను నిర్మించారని... కనీసం ఫైర్ సేఫ్టీ కూడా లేదన్నారు. సచివాలయం అనేది రాష్ట్రానికి ముఖ్య సూచికంగా ఉండాలన్నారు సీఎం.
సెక్రటేరియెట్‌లో అన్ని శాఖల భవనాలు ఒకేచోట ఉండాలన్నారు కేసీఆర్. కాని ప్రస్తుత సచివాలయంలో మాత్రం భిన్నమైన పరిస్థితి ఉందని చెప్పారు. అసెంబ్లీ, సెక్రటేరియెట్‌లు ఒకేచోట ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వాస్తు కోసమే కొత్త భవనాలను నిర్మిస్తున్నామనడం సరికాదని... వాస్తు అనేది ఓ కారణం మాత్రమేనన్నారు సీఎం.
కొత్త సెక్రటేరియెట్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్ మండిపడ్డారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోమన్నారు. తాము ఏం చేస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారని... ఏదైనా తప్పు జరిగితే ప్రజా కోర్టులో తేలుతుందన్నారు. కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రధానితో పునాది వేయిస్తామని... చారిత్రక కట్టడాన్ని కట్టి తీరుతామన్నారు. అది మంచో చెడో ప్రజలే నిర్ణయిస్తారన్నారు సీఎం.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







