భారీ వర్షాల కారణంగా మూతబడ్డ స్కూళ్ళు
- November 01, 2017
తమిళనాడులో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని స్కూళ్ళు , కాలేజీలు మూతపడ్డాయి. గత రెండు సంవత్సరాల క్రితం వర్షబీభత్సం మిగిల్చిన విషాదం ఇంకా మరువక ముందే మరోసారి కుండపోత వర్షాలతో జనాలు అతలాకుతలం అవుతున్నారు. ఈశాన్య రుతపవనాలకు తోడు అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి బాలచంద్రన్ తెలిపారు. తంజావూరు జిల్లాతోపాటు చెన్నై, ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తంజావూరు జిల్లా తిన్నయూర్‌లోని వొరతనడుకు సమీపంలో భారీ వర్షం ధాటికి ఓ ఇంటి గోడ కుప్పకూలింది.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. భారీ వర్షాలతో రోడ్లన్నీ నీటిలో నిండిపోవడంతో సెలవులను ప్రకటించారు . లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ కొరత ఏర్పడింది. తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొ న్నారు. చైన్నైలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇళ్ళలోకి వర్షపు నీరు చేరింది. 2015 నాటి వరదల పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదమున్నందున పౌర సేవలను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







