ఐకిడోలో రాహుల్ గాంధీకి బ్లాక్ బెల్ట్.!
- November 01, 2017
రాహుల్ గాంధీ మళ్లీ సెన్సేషనల్ అయ్యారు.. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. మొన్నటి వరకూ తన పెంపుడు కుక్క వీడియో పెట్టి విమర్శల పాలైన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్‌పై.. ఇప్పుడు మాత్రం ప్రశంసలు వర్షం కురుస్తోంది. నెట్టింట్లో తిరుగుతున్న రాహుల్ ఫోటోలను చూసి కాంగ్రెస్ కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుంటుంటే.. ప్రత్యర్థి పార్టీల నేతలు మాత్రం షాక్ అవుతున్నారు. రాహుల్‌కు ఇంత టాలెంట్ ఉందా అంటూ... నోరెళ్లబెడుతున్నారు..
రాహుల్ గాంధీ.. బ్లాక్ బెల్ట్ హోల్డర్... కరాటె, కుంగ్‌ఫూ కాదు.. ఐకిడోలో ఎక్స్పర్ట్. తనముందు ఎంత బలమైన ప్రత్యర్థి ఉన్నా.. తనకు ఏమాత్రం గాయం కాకుండా.. ప్రత్యర్థిని చిత్తు చేయగల సత్తా రాహుల్ గాంధీ సొంతం. రాజకీయాల్లో బిజీబిజీగా ఉన్నా.. కొంతకాలంగా ఐకిడో ప్రాక్టీస్‌కు టైమ్ కేటాయిస్తున్న కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్.. ఈ విద్యలో బ్లాక్ బెల్ట్‌ను కూడా సంపాదించారు. దీన్ని బట్టి.. ఆయన టాలెంట్ ఎంతో తెలుసుకోవచ్చు.
రాహుల్‌కు రాజకీయం తెలియదని.. ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాడంటూ సెటైర్ల మీద సెటైర్లు వేసే ప్రత్యర్థి పార్టీల నేతలూ.. ఈ ఫోటోలు చూసి అవాక్కయ్యారు. అయితే.. ఇవన్నీ ఫేక్ ఫోటోస్ కావచ్చన్న అనుమానాలూ చాలామందికి ఉన్నాయి. వీటిపై క్లారిటీని స్వయంగా రాహులే ఇచ్చారు. ఇటీవలే ఓ సమావేశంలో పాల్గొన్న రాహుల్... బాక్సర్ విజయేందర్ సింగ్ అడిగిన ప్రశ్నకు.. తాను ఐకిడోలో బ్లాక్ బెల్ట్ హెల్డర్ను అంటూ సమాధానం ఇవ్వడంతో.. సోషల్ మీడియా కూత మొదలుపెట్టింది.. రాహుల్‌ను పొగుడుతూ.. పోస్టులు.. ట్వీట్ల హల్చల్ మొదలయ్యింది.
కరాటే.. కుంగ్ ఫూ అంతగా కాకపోయినా.. ఐకిడో ఇప్పుడిప్పుడే ప్రచారం పొందుతోంది. జపాన్‌లో ఈ క్రీడ పుట్టింది. ఆత్మరక్షణతో పాటు.. ప్రత్యర్థికి ఎలాంటి గాయం చేయకుండా ఓడించాలన్న కాన్సెప్ట్‌తో దీన్ని తయారు చేశారు.. జపాన్ సైన్యంలో పనిచేసిన మోరిహై యూషిబా రూపొందించారు. 2009 నుంచి దీన్ని రాహుల్ నేర్చుకుంటున్నారు. తుగ్లక్‌లేన్‌లోని తన నివాసంలోనే రాహుల్ దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటారట. 2013లో జరిగిన పోటీల్లో నెగ్గిన రాహుల్.. ఈ బ్లాక్‌బెల్ట్‌ను దక్కించుకున్నారు. అంతేకాదు.. బ్రెజీలియన్ యుద్ధవిద్య జియూ-జిత్సును లండన్‌లో నేర్చుకున్నాడట. కత్తిసాములోనూ రాహుల్ ఎక్స్పర్ట్ అంటున్నాడు అతని కోచ్. రాహుల్ కారణంగా ఇప్పుడు మన దేశంలోనూ ఐకిడోకు విపరీతమైన పాపులారీటీ వచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







