రాజకీయాల్లోకి హీరో ఉపేంద్ర
- November 02, 2017
బహుబాష నటుడు, స్యాండిల్ వుడ్ రియల్ స్టార్, కర్ణాటక ప్రజ్ఞావంత (ప్రతిభావంతులు) జనతా పార్టీ (kPJP) వ్యవస్థాపకుడు ఉపేంద్ర మీద బెంగళూరు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓటర్లను రెచ్చగొట్టి చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ ఉపేంద్ర మీద కేసు పెట్టారు.
రియల్ స్టార్ ఉపేంద్ర మంగళవారం కర్ణాటక ప్రజ్ఞావంత (ప్రతిభావంతులు) జనతా పార్టీ (kPJP)ని ఏర్పాటు చేసి రాజకీయ రంగ్రప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఆ సందర్బంలో హీరో ఉపేంద్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు రాజకీయ పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకోవాలని ఓటర్లకు సూచించారు.
ఎన్నికల సందర్బంగా రాజకీయ పార్టీల నాయకులు ఎవరూ డబ్బులు ఇచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం ఎవ్వరికి వెయ్యాలో మీరే నిర్ణయం తీసుకోవాలని ప్రజలను ఉద్దేశించి ఉపేంద్ర అన్నారని ఆరోపణలు ఉన్నాయి. చట్ట వ్యతిరేకంగా రాజకీయ పార్టీల నాయకుల దగ్గర డబ్బులు తీసుకోవాలని ఉపేంద్ర ఓటర్లను రెచ్చగొడుతున్నారని ఆయన మీద చర్యలు తీసుకోవాలని జేడీయూ పార్టీ ఆరోపించింది.
జేడీయూ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్, నాగేష్ బెంగళూరు నగరంలోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా గురువారం హీరో ఉపేంద్ర మీద ఫిర్యాదు చేశారు. ఉపేంద్ర మీద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. రాజకీయ పార్టీ పెట్టిన హీరో ఉపేంద్ర కేవలం రెండు రోజుల్లోనే ప్రత్యర్థి రాజకీయ పార్టీ నాయకులు పెట్టిన కేసు విచారణ ఎదుర్కొంటున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం