కలలో ఎన్టీఆర్ అందిస్తున్న స్క్రిప్ట్ సహాయం...!
- November 02, 2017
వామ్మో ఎన్టీఆర్ జీవితాన్ని సినిమాగా తీయడం సంగతి ఏమో కానీ... ఈ సినిమా నేపథ్యంలో వస్తున్న వార్తలు వింటుంటే మాత్రం దిమ్మతిరిగి పోతుంది. ఇప్పటికే వర్మ పుణ్యామా అంటూ ఎన్టీఆర్ బయోపిక్ పై పెద్ద దుమారమే రేగింది. 'లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి నాకు అపారమయిన బలమిస్తున్న కేవలం ఒకే ఒక శక్తి ఎవరంటే అది ఎన్టీఆర్ అనే వ్యక్తి.. ఆ మహానుభావుడి ఆత్మ రోజూ నా కలలోకి వచ్చి నాకు స్క్రీన్ ప్లే రాయడానికి సహకరిస్తోంది' అని పిచ్చి పోస్టులు పెట్టాడు. ఇప్పుడు తాజాగా ఆయన రూట్ లోకే వచ్చాడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఈయన కూడా ఎన్టీఆర్ బెయోపిక్ తీస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దానికి "లక్ష్మీస్ వీరగ్రంథం" కూడా పేరు పెట్టారు. లక్ష్మీ పార్వతి జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ వీరగ్రంథం అనే చిత్రాన్ని రూపొందించనున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈయన కలలోకి కూడా ఎన్టీఆర్ వస్తున్నారట.
లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా తీయడానికి ప్రధాన కారణం మహానటుడు, అన్న ఎన్టీఆర్. ఆ మహానుభావుడు నా కలలోకి వచ్చి స్క్రిప్టుకు సహాయం చేస్తున్నారు. తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని విషయాలను స్వయంగా ఎన్టీఆర్ నాకు వివరిస్తున్నాడు అని చెబుతున్నాడు. ఎన్టీఆర్ చెప్పిన విషయాలను ఉన్నది ఉన్నట్టుగా తీస్తాను అని ఆయన వివరించడం ఆసక్తిగా మారింది.
మొత్తానికి ఎన్టీఆర్ తన ఫ్యామిలీ మెంబర్స్ కలలోకి మాత్రం రావడం లేదు కానీ... పనిగట్టుకొని వీళ్ల కళ్లలోకి మాత్రం వస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..