బహ్రెయిన్‌ ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా తొమ్మిదేళ్ళ బాలిక

- November 02, 2017 , by Maagulf
బహ్రెయిన్‌ ఎక్స్‌పోలో ప్రధాన ఆకర్షణగా తొమ్మిదేళ్ళ బాలిక

మానామ: తొమ్మిదేళ్ళ బాలిక, బహ్రెయిన్‌ ఎంటర్‌ప్రెన్యూసర్స్‌ ఎగ్జిబిషన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. యంగ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ జుమానా అల్‌ జెన్‌జి, వందలాదిమంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌లో ఒకరుగా ఈ వెంట్‌లో పాల్గొంది. రెండేళ్ళుగా నిర్వహిస్తోన్న 'జుజు స్వీట్‌ స్పా'కి సంబంధించి ఆమె ఓ చిన్న స్టాల్‌ నిర్వహించడం జరుగుతోంది. ఈ స్టాల్‌ ఇప్పుడు బహ్రెయిన్‌ ఎక్స్‌పోలో సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. తొమ్మిదేళ్ళ బాలిక ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న వైనం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఏడేళ్ళ నుంచే అల్‌ జెన్‌జి ఎక్స్‌ఫోలియాంట్స్‌ని తయారు చేయడం, విక్రయించడం ప్రారంభించింది. తాను తయారు చేసి విక్రయించే స్క్రబ్స్‌ డెడ్‌ స్కిన్‌ని తొలగించడంతోపాటుగా జెర్మ్స్‌, బ్యాక్టీరియాని కూడా తొలగిస్తాయని, అవి స్వయంగా తానే తయారు చేస్తానని అల్‌ జెన్‌జి చెప్పింది. ఎలా తయారు చేస్తావు? అన్న ప్రశ్నకు, అది సీక్రెట్‌ అని సమాధానమిచ్చిందామె. ఎలాంటి కెమికల్స్‌ లేకుండా సహజసిద్ధమైన పద్ధతుల్లో వాటిని తయారు చేస్తానని వివరించింది అల్‌ జెన్‌జి. తన ఆంటీ ఓ చిన్న ఐడియా తనకు ఇచ్చిందనీ, మిగతాదంతా తన ఆలోచనతోనే చేశానని అల్‌ జెన్‌జి ఎబబీతీష్ట్రబీస్త్రసతీ. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com