కిడ్నీ వ్యాధితో పోరాటంలో ఓడిన బాలుడు

- November 02, 2017 , by Maagulf
కిడ్నీ వ్యాధితో పోరాటంలో ఓడిన బాలుడు

మనామా: నాలుగేళ్ళ బహ్రెయినీ బాలుడు, కిడ్నీ సంబంధిత సమస్యతో ప్రాణాలు కోల్పోయాడు. ఏడు నెలల వయసు నుంచే కిడ్నీ సమస్య ఈ బాలుడ్ని వెంటాడుతోంది. ఫ్రాన్స్‌లో జరిగిన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్‌ సందర్భంగా చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ తరహా కిడ్నీ సమస్యతో బాధపడిన తొలి చిన్నారిగా జవాద్‌ సిద్దిక్‌ వార్తల్లోకెక్కాడు. ప్రతి 12 గంటలకు ఓ సారి ఈ చిన్నారికి డయాలసిస్‌ చేయాల్సి వచ్చేది. కుమారుడికి తన కిడ్నీని దానం చేయాలని భావించిన తండ్రి త్యాగం వృధా అయిపోయింది. బాలుడి మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com