దేశంలోని అన్ని మొబైల్ నెంబర్లను ఆధార్‌తో లింక్ తప్పనిసరి
- November 02, 2017
ఆఖరి గడువు ఫిబ్రవరి 6
లింక్ చేయనివాటిపై ఆంక్షలు
దేశంలోని అన్ని మొబైల్ నెంబర్లను ఆధార్‌తో తప్పనిసరిగా లింక్ చేయాల్సిందేనని కేంద్రం ప్రభుత్వం మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆధార్‌తో మొబైల్‌ను ఫిబ్రవరి 6 లోగా అందరూ తప్పనసరిగా అనుసంధానం చేసుకోవాలన కేంద్రం ప్రకటించింది. అంతేకాక పాత బ్యాంక్ అకౌంట్లకు ఇది వర్తిస్తుందని కేంద్రం తెలిపింది. ఆధార్, మొబైల్ నెంబర్ అనుసంధానంపై గడువుతేదీలో ఇక మార్పులు ఉండవని కేంద్రం స్పష్టం చేసింది. అయితే బ్యాంక్ అకౌంట్లకు గడుపు తేదీని మాత్రం మార్చి 31 వరకూ ప్రభుత్వం పొడిగించింది.
ఆధార్‌తో అనుసంధానం చేయడం అనేది.. వ్యక్తిగత గోప్యతా హక్కును ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టులో వేల సంఖ్యలో పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిని రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది.
ఇదిలా ఉండగా.. మార్చి 31లోపు ఆధార్‌తో అనుసంధానం చేయబడని బ్యాంకు ఖాతాలను స్థంభింపచేయాలని ఆయా బ్యాంకులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







