100వ ఎ380 ఎయిర్‌క్రాఫ్ట్‌కి ఎమిరేట్స్ స్వాగతం
- November 03, 2017
శుక్రవారం ఎయిర్‌బస్ ఎ-380 వందవ విమానం డెలివరీ సందర్భంగా ఎమిరేట్స్ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించింది. యూఏఈ తొలి ప్రధాని, ఫాదర్ ఆఫ్ నేషన్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్‌కి ట్రిబ్యూట్‌గా ఈ 100వ విమానాన్ని డెలివరీ చేశారు. హంబర్గ్‌లోని డెలివరీ సెంటర్‌లోనూ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఎయిర్‌బస్ డెలివరీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ డిస్కషన్‌లో ఎమిరేట్స్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, ఎ-380 100వ విమానంపై ఫొటోకి సంబంధించి యూఏఈ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సెలక్ట్ చేశారని అన్నారు. 2018వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ జాయెద్‌గా ఇప్పటికే ప్రకటించారు. 2018లో జాయెద్ 100వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఎ-380 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన విమానం. ఈ విమాన ప్రయాణం ప్రయాణీకులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







