పాటల చిత్రీకరణ కోసం యూరప్ వెళ్లిన పవన్‌కల్యాణ్25
- November 04, 2017
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ నూతన చిత్రం రూపుదిద్దుకుంటోన్న సంగతి తెలిసిందే. కీర్తిసురేశ్, అను ఇమ్మాన్యుయెల్ ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం ఇటీవలే యూరప్ వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ పవన్, త్రివిక్రమ్‌తో కలిసి దిగిన సెల్ఫీను అను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'గుడ్ కంపెనీ.. గుడ్ వర్క్' అని రాశారు. పవన్ స్టైల్‌గా కప్ పట్టుకుని ఉన్న ఈ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెలాఖరుకు సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది. పవన్ 25వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి 'అజ్ఞాతవాసి' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. నవంబరు 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. డిసెంబరులో పాటల్ని, జనవరి 10న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పవన్ ఇందులో ఐటీ నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







