యూజర్లుకు క్షమాపణ చెప్పిన వాట్సాప్‌

- November 04, 2017 , by Maagulf
యూజర్లుకు క్షమాపణ చెప్పిన వాట్సాప్‌

మెసేజింగ్‌ సర్వీసుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాట్సాప్‌ కొద్ది సేపు పనిచేయకుండా అయిపోతే ఏమై పోతాది? ప్రపంచమంతా తలకిందులైనట్టు అయిపోతాదా? ఏమో.. నిన్న ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌ సేవలకు కొద్దిసేపు పాటు అంతరాయం చోటుచేసుకుంది. దీనికి యూజర్లు తెగ ఆందోళన చెందారు. వాట్సాప్‌ పనిచేయకుండా పోవడంతో విసిగెత్తిపోయిన యూజర్లు, ట్విట్టర్‌లో పెద్ద ఎ‍త్తున్న ఫిర్యాదులు చేశారు. అనంతరం కొద్ది సేపటికి వాట్సాప్‌ తన సేవలను రీస్టోర్‌ చేసి, యూజర్లను శాంతింప చేసింది. '' గంట పాటు గ్లోబల్‌ వాట్సాప్‌ యూజర్లు, తమ యాప్‌ను యాక్సస్‌ చేసుకోవడంలో ఇబ్బందులు పడ్డారు. ఈ సమస్యను ప్రస్తుతం పరిష్కరించాం. ఈ అంతరాయానికి తాము క్షమాపణలు కోరుతున్నాం'' అని వాట్సాప్‌ అధికార ప్రతినిధి చెప్పారు. 

60 శాతం మంది కస్టమర్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారని ఇండిపెండెంట్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ రిపోర్టు చేసింది. టెక్ట్స్‌ మెసేజ్‌లను పంపడంలోనూ, యాప్‌లోకి లాగిన్‌ అవ్వడంలోనూ  ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు పేర్కొంది. 25 శాతం సమస్య మెసేజ్‌ను పొందడంలో ఏర్పడిందని, 14 శాతం లాగిన్‌ అవడంలో ఆటంకాలు చోటుచేసుకున్నట్టు ఎక్స్‌ప్రెస్‌.కో.యూకే తెలిపింది. భారత్‌లో కూడా ఈ సమస్య ఏర్పడింది. ఇదే రకమైన పరిస్థితిని యూజర్లు ఈ ఏడాది మేలో కూడా ఎదుర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు వాట్సాప్‌ సేవలు ఆగిపోయాయి. గ్లోబల్‌గా వాట్సాప్‌కు నెలవారీ 1.3 బిలియన్‌ యూజర్లున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com