సౌదీ లో కడప మహిళ కన్నీటి కధ

- November 04, 2017 , by Maagulf
సౌదీ లో కడప మహిళ కన్నీటి కధ

 రియాధ్: తాళి కట్టిన భర్త ఆకస్మికంగా మృతి చెందడంతో ఆ మహిళ ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంది. కన్నా కూతురి బంగారు భవిష్యత్తు కోసం అప్పులు చేసి మరీ సౌదీకి వెళ్లిన ఆమెకి అక్కడ సైతం విధి వెక్కిరించింది. అయిదు నెలల నుంచి జీతం ఇవ్వరు. అక్కడై నుంచి వచ్చేద్దామంటే కాలు సైతం బైటపెట్టనివ్వరు. యజమాని ఆమెని బందీగా మార్చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతం కడప జిల్లాకు చెందిన శివమ్మ అనే మహిళ సౌదీ అరేబియాలో బానిస మాదిరిగా బతుకు గడుపుతుంది. సోషల్ మీడియా ఆమెకి ఒక అవకాశంగా దొరకడంతో తన వేదనను  ఓ వీడియో రూపందించి  పోస్ట్ చేసింది. ఆ వీడియోలో సారాంశం ఇది ‘ వసతి ఇచ్చి..భోజనం పెట్టి నెలకు 30వేల జీతం ఇస్తామని  చెప్పారు.. అక్కడకు వెళ్లిన తర్వాత వారు ఇచ్చిన మాటపై నిలబడలేదు. దారుణమైన మోసం చేశారు. అబద్దాలు చెప్పారు. అప్పుచేసి మరీ సౌదీకి వచ్చాను. నన్ను ఓ సౌదీ యజమానికి అమ్మేశారు. నన్ను భారత్‌కు పంపించమంటే ఆయన ఒప్పుకోవడం లేదు. మీ కాళ్లు పట్టుకుంటా.. నన్ను ఎలాగైనా సొంతూరికి చేరుకునేలా చేయండి. ఇక్కడ  నా అనేవాళ్లు ఎవరూ నాకు లేరు. మూడు రోజుల నుంచి ఏడుస్తూనే ఉన్నా. అయిదు నెలల నుంచి జీతం లేదు. బయటకు పంపించలేదు. బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తే నా తల పగలగొట్టారు. కొట్టారు. ఆ నొప్పులు భరించలేక నరకం అనుభవిస్తున్నాను. నన్ను సౌదీకి  పంపిన వ్యక్తికి ఫోన్ చేస్తే.. ‘నువ్వు  చస్తే చావు.. బతికితే బతుకు.. డబ్బులు కట్టేశా..’ అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. పనిచేయలేక అబద్ధాలు ఆడుతున్నావని అంటున్నారు. నేను నా భారతదేశానికి  రావాలి. నాకు ఒక కూతురు ఉంది. నెలకు మూడు వేలు అద్దె ఇస్తానని బంధువుల ఇంట్లో ఉంచా. ఇక్కడ నా దగ్గర ఉన్న ఫోన్ కూడా లాక్కున్నారు. వేరే పనిమనిషి పోన్‌తో ఈ వీడియోను చేస్తున్నా. నన్ను దయచేసి రక్షించండి. ప్లీజ్’... అంటూ ఆమె తన బాధను చెప్పుకొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com