టెక్సాస్ సదర్ల్యాండ్ స్ర్పింగ్స్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో కాల్పుల మోత...27 మంది మృతి
- November 05, 2017
24 మందికి గాయాలు
అమెరికాలో మళ్లీ దారుణం
మృతుల్లో రెండేళ్ల చిన్నారి
హంతకుడి కాల్చివేత
టెక్సాస్: అమెరికాలో మరో ఉన్మాది విరుచుకుపడ్డాడు. ఆదివారం ఉదయం చర్చిలో విచ్చలవిడిగా కాల్పులు జరిపి 27 మంది అమాయకుల్ని పొట్టన బెట్టుకున్నాడు. మృతుల్లో రెండేళ్ల చిన్నారి కూడా ఉంది. మరో 24 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. హంతకుడిని పోలీసులు కాల్చిచంపారు. టెక్సా్సలోని సదర్ల్యాండ్ స్ర్పింగ్స్లోని ఫస్ట్ బాప్టిస్ట్ చర్చిలో దారుణం జరిగింది. ఘటన జరిగినపుడు చర్చిలో 50-60 మంది ఉన్నారు. హంతకుడు గన్ను పలుమార్లు లోడ్ చేసినట్లు తెలుస్తోంది. కాల్పుల అనంతరం వాహనంలో పారిపోతూ మరో వాహనాన్ని ఢీకొన్నాడు. దిగిపారిపోతూ ఉంటే పోలీసులు కాల్చిచంపేశారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







