సన్నబడాలనుకుంటే.. బ్రౌన్‌బ్రెడ్ శాండ్‌విచ్ తీసుకోండి..
- November 05, 2017
సన్నబడాలనుకునేవారు తినే పదార్థాల్లో కొవ్వు లేకుండా చూసుకోవాలి. మొలకలూ, పండ్లూ, డ్రైఫ్రూట్స్, బ్రౌన్‌బ్రెడ్ శాండ్‌విచ్ వంటివి ఎంచుకోవడం మంచిది. ఆఫీసుల్లో గంటలపాటు కూర్చుని పనిచేసేవారు తరచూ వీటిని డైట్‌లో చేర్చుకోవాలి. అలాగే మేలుచేసే కొవ్వు పదార్థాలను ఎంచుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాదం, వాల్‌నట్లూ, పిస్తా వంటి డ్రైఫ్రూట్లూ, రైస్‌బ్రాన్ నూనె వంటివి ఆహారంలో చేర్చుకోవాలి.
పొద్దున్నే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలి. అందులోనూ మాంసకృత్తులూ, పీచూ, సంక్లిష్ట పిండిపదార్థాలున్నవి ఎంచుకుంటే మంచిది. మధ్యాహ్నం భోజనం తక్కువ తీసుకున్నవారవుతారు. గుడ్లూ, పప్పుధాన్యాలూ, అవిసెగింజలు, చేపలు వంటివాటితో పాటు కూరగాయలూ, ఆకుకూరలను ఆహారంలో చేర్చుకోవాలి.
బరువు పెరిగేందుకు పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారడమే. ఆ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే సాధారణ బియ్యానికి బదులు ముతక బియ్యం, రాగులూ, కొర్రలూ, జొన్నల వంటివాటికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాటికి జతగా కూరగాయలూ, ఆకుకూరల్ని ఎంచుకుంటే పోషకాలు అందుతాయి. శరీర జీవక్రియా రేటు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







