ప్రాన్స్‌ మంచూరియా

- November 06, 2017 , by Maagulf
ప్రాన్స్‌ మంచూరియా

కావలసిన పదార్థాలు: (శుభ్రం చేసిన) పచ్చిరొయ్యలు - 300 గ్రా., ఉల్లితరుగు - 1 కప్పు, మైదా - 1 టేబుల్‌ స్పూను, కార్న్‌ఫ్లోర్‌ - 4 టేబుల్‌ స్పూన్లు, అల్లం, వెలుల్లి తరుగు - 1 టీ స్పూను చొప్పున, వెల్లుల్లి పేస్టు - 2 టీ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, అజినమోటో - చిటికెడు, టమోటా, చిల్లీ, సోయా సాస్‌లు + వెనిగర్‌ - 2 టేబుల్‌ స్పూన్ల చొప్పున, మిరియాల పొడి - అర టీ స్పూను, ఉల్లికాడల తరుగు - 2 టేబుల్‌ స్పూన్లు, క్యాప్సికం - 1, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం : రొయ్యలను మైదా, 2 టేబుల్‌ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌, 1 టేబుల్‌ స్పూను అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్‌ స్పూను సోయా సాస్‌, ఉప్పులతో కలిపి గంటసేపు పక్కనుంచి నూనెలో దోరగా వేగించాలి. కొద్ది నూనెలో వెల్లుల్లి, ఉల్లి తరుగు, ఉల్లి కాడలు, క్యాప్సికం తరుగు, అజినమోటో, వెనీగర్‌, ఉప్పు వేసి 2 నిమిషాలు వేగించాలి. రొయ్యలు, సోయా సాస్‌, చిల్లీ సాస్‌, టమోటా సాస్‌ కూడా వేసి కరిగించిన కార్న్‌ఫ్లోర్‌ చల్లాలి. చివర్లో మిరియాల పొడి చల్లి దించేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   
Copyrights 2015 | MaaGulf.com