ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని దాడి మా పనే: ఐసిస్
- November 07, 2017
ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లోని ఓ టెలివిజన్ ఛానెల్‌పై దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. స్థానిక షంషాద్ టీవీ ఛానల్ భవనంలోకి చొరబడ్డ కొందరు దుండగులు అక్కడి ఉద్యోగులపై బాంబులు విసురుతూ కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. రెండు గంటల పాటు దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు.
'పోలీసుల దుస్తుల్లో వచ్చిన దుండగులు సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపి లోపలికి చొరబడ్డారు. గ్రనేడ్లు విసురుతూ కాల్పులు జరిపారు. కొద్ది మందికి తూటాలు తగిలాయి. చాలా మంది ఉద్యోగులు తప్పించుకొని వేరే అంతస్తులోకి పారిపోయారు' అని అక్కడ ఉద్యోగం చేసే అబెద్ ఎషాస్ అనే ప్రత్యక్ష సాక్షి తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు టెలివిజన్ కార్యాలయ భవనం గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించారు. కాల్పులకు పాల్పడిన దుండగుడిని మట్టుబెట్టారు.
మరొక దుండగుడిని భవనం వెలుపలే కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో టెలివిజన్ ప్రసారాలను తాత్కాలికంగా నిలిపివేశారు. రెండు గంటల తర్వాత వాటిని పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







