ICRF సమ్మర్ అవేర్నెస్..200 మంది కార్మికులకు ప్రయోజనం..!!
- June 28, 2026
మనామా: బహ్రెయిన్‌లో తీవ్రమైన వేసవి ఎండల నుండి కార్మికులను రక్షించడానికి కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా, 'థర్స్ట్ క్వెంచర్స్ 2026' ప్రచారం రెండవ వారం గలాలిలోని ఒక కంపెనీలో జరిగింది.ఈ కార్యక్రమానికి ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్–ICRF బహ్రెయిన్ అధ్యక్షత వహిస్తోంది.ఇది కార్మికుల భద్రత మరియు హైడ్రేషన్‌ను ప్రోత్సహించడంపై దృష్టి సారించిన తన వార్షిక సమ్మర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA), మరియు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) మద్దతు ఇస్తున్నాయి.
గలాలిలోని మహమ్మద్ జలాల్ కాంట్రాక్టింగ్ కంపెనీలో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ సుమారు 200 మంది కార్మికులకు వాటర్, జ్యూస్, లాబన్, ఆరేంజ్, ఆపిల్, అరటిపండ్లు వంటి తాజా పండ్లను అందించారు. సమ్మర్ లో తీసుకోవల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసీఆర్ఎఫ్ ఛైర్మన్ అడ్వకేట్ వి. కె. థామస్, జాయింట్ సెక్రటరీ సురేష్ బాబు, సలహాదారు అరుల్దాస్ థామస్, థర్స్ట్ క్వెంచర్స్ కోఆర్డినేటర్ చెంబన్ జలాల్, ఇతర ఐసీఆర్ఎఫ్ అధికారులతో పాటు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







