ఒమన్ లో ప్లాస్టిక్ పై నిషేధం..జూలై 1 నుండి ఐదవ దశ ప్రారంభం..!!
- June 28, 2026
మస్కట్: ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం, సహజ వనరులు మరియు జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం లక్ష్యంగా ఒమన్ పర్యావరణ ప్రాధికార సంస్థ 2026 జూలై 1 నుండి ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగులపై తన నిషేధం యొక్క ఐదవ దశను అమలును ప్రారంభించనుంది. ఈ దశలో ఫర్నిచర్ దుకాణాలు, కత్తుల దుకాణాలు, బంగారం మరియు వెండి విక్రయ కేంద్రాలు, కార్ కేర్ సెంటర్లు, మరియు వాహన డీలర్‌షిప్‌లలో ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగుల వాడకాన్ని నిషేధిస్తుంది.
పర్యావరణ ప్రాధికార సంస్థలో రసాయన శాస్త్ర నిపుణురాలైన ఇంజనీర్ అబీర్ బింట్ ఒమర్ అల్ ఖాసిమి ప్రకారం, ఒక్కసారి వాడి పారేసే ప్లాస్టిక్ బ్యాగులపై ఆధారపడటాన్ని తగ్గించడం మరియు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం లక్ష్యంగా మునుపటి దశలకు కొనసాగింపుగా ఈ దశ కొనసాగనుంది.
2025 ద్వితీయార్థంలో అమలు చేసిన నాల్గవ దశలో అథారిటీ ఒమన్ గవర్నరేట్‌ల వ్యాప్తంగా 3,000కు పైగా తనిఖీలు నిర్వహించింది. 200కు పైగా అవగాహన ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. కేవలం 2026 మొదటి త్రైమాసికంలోనే 1,485 తనిఖీ పర్యటనలు నిర్వహించగా, 106 పర్యావరణ ఉల్లంఘనలను నమోదు చేసింది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







