బంగారం ధరకు పెళ్లి కళ

- November 07, 2017 , by Maagulf
బంగారం ధరకు పెళ్లి కళ

 బంగారం ధర భగ్గుమంది. మంగళవారం రూ.255 పెరగడంతో పది గ్రాముల పసిడి ధర రూ.30,390కి చేరింది. అంతర్జాతీయ పరిస్థితులు, పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు వూపందుకున్నాయి. దీంతో పసిడి ధర పెరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.650లు పెరగడంతో కిలో వెండి రూ.40,700కి చేరింది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల నుంచి కొనుగోళ్లు భారీగా రావడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధర 0.95శాతం పెరగడంతో ఔన్సు 1,281.50 డాలర్లు పలికింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com