జపాన్‌లో పురుషులతో శృంగారం జరిపి హత్యలు చేయడం
- November 07, 2017
జపాన్‌లో సంచలనం సృష్టంచిన బ్లాక్ విడో కేసులో చిసాకో కాకేహి (70)కి మరణదండన విధిస్తూ క్యోటో జిల్లా న్యాయస్థానం మంగళవారం ఉదయం తీర్పు వెలువరించింది.
జపాన్ లో సంచలనం సృష్టించిన 'బ్లాక్ విడో' కేసులో ఈ ఉదయం కోర్టు తీర్పు వెలువడింది. తన భర్తను, ఇద్దరు ప్రియుళ్లను దారుణాతి దారుణంగా హత్య చేసిందని చిసాకో కాకేహిపై ఆరోపణలున్నాయి.
మగవాళ్లను ఆకర్షించి, ఆపై వారితో శృంగారం జరిపి హత్యలు చేయడం కాకేహి దినచర్య. ఈ వ్యవహారం బయటకు పొక్కిన తరువాత జపాన్ లో కలకలం రేగింది. డేటింగ్ ఏజన్సీలు, ఇతర వెబ్ సైట్ల ద్వారా తనకన్నా పెద్దవాళ్లను, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, పిల్లలు లేని ఒంటరి వాళ్లను ఎంచుకుని, వారితో పరిచయం పెంచుకుంటుంది చిసాకో కాకేహీ.
జీవిత బీమా పాలసీలు చేయించి, నామినీగా తన పేరును రాయించుకుని, ఆపై వారిని హతమార్చేది. హత్యలు చేసేందుకు పదేళ్ల వ్యవధిలో బిలియన్ యన్ లు వెచ్చించి సైనైడ్ ను కూడా కొనుగోలు చేసింది. తొలుత కోర్టులో నేరాన్ని కాకేహి ఒప్పుకోలేదు. చివరికి తప్పును ఒప్పుకుని తన నాలుగో భర్తను హత్య చేసిన విషయంతో ప్రారంభించి మొత్తం తాను చేసిన హత్యలను ఒప్పుకొంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







