'T20' సిరీస్ కైవసం చేసుకున్న భారత్
- November 07, 2017నిర్ణయాత్మక మూడో టీ20 మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తేనేం.. ఇరు జట్లు మధ్య హోరాహోరీ పోరు అభిమానులను అలరించింది. విజయం కోసం పట్టుదలతో ఆఖరివరకు పోరాడిన కివీస్‌ను కట్టడిచేసి మూడో టీ20లో భారత్ 6 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. వరుణుడి అంతరాయంతో ఎనిమిది ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన 5 వికెట్లకు 67 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఔట్‌ఫీల్డ్ తడిగా ఉండటంతో భారీ స్కోరు నమోదుకాలేదు. మనీశ్‌పాండే(17: 11 బంతుల్లో 1×4, 1×6), హార్దిక్ పాండ్య(14 నాటౌట్: 10 బంతుల్లో 1×6), విరాట్ కోహ్లి(13: 6 బంతుల్లో 1×4, 1×6) ధాటిగా ఆడారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 8 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 61 పరుగులు మాత్రమే చేసింది. అయితే భారీ షాట్లతో విరుచుకుపడుతున్న కివీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేయడంలో భారత్ బౌలర్లు పైచేయి సాధించారు. గ్లెన్ ఫిలిప్స్(11), గ్రాండ్‌హోం(17 నాటౌట్) చివరి వరకు పోరాడారు. భారత బౌలర్లలో బుమ్రా 2, భువనేశ్వర్‌కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీశారు. అంతకుముందువన్డే సిరీస్‌ను సైతం భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన యువ బౌలర్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ దక్కాయి.
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్‌లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!