అంజీర్ కా మీఠా
- November 07, 2017
కావలసిన పదార్ధాలు: ఎండు అంజీరాలు - కిలో, పాలు - అరలీటర్, పంచదార - అరకిలో, నెయ్యి - 200 గ్రా, కోవా - 200 గ్రా, యాలకుల పొడి - టీ స్పూన, బాదం, జీడిపప్పు, పిస్తా - అలంకరణకు సరిపడా.
తయారీ పద్ధతి: అంజీరాల్ని బాగా కడగాలి. గిన్నెలో పాలు పోసి మరిగించి దించాలి. కడిగిన అంజీర్ పండ్లను చిన్న చిన్న ముక్కలుగా చేసి పాలల్లో వేసి సుమారు 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఆ తరువాత ఈ మొత్తాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి. తరువాత ఈ మిశ్రమాన్ని కోవాతో కలపాలి.
బాణలిలో నెయ్యి వేసి కోవా మిశ్రమాన్ని సిమ్‌లో సుమారు అరగంటసేపు కలుపుతూ ఉడికించాలి. అందులోనే పంచదారవేసి మరో పది నిమిషాలపాటు కలుపుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరగా అయిన తరువాత నెయ్యి రాసిన ప్లేటులో వేసి బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులతో అలంకరించి ఆరాక ముక్కలుగా కోస్తే సరి.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి