ఇరాన్‌పై ప్రభావం చూపని ట్రంప్‌ నిషేధం: డబ్ల్యుటిఎం పర్యాటక మేనేజర్‌

- November 07, 2017 , by Maagulf
ఇరాన్‌పై ప్రభావం చూపని ట్రంప్‌ నిషేధం: డబ్ల్యుటిఎం పర్యాటక మేనేజర్‌

ముస్లిం దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన నిషేధం వల్ల ఇరాన్‌పై ఎలాంటి ప్రభావం లేదని వరల్డ్‌ ట్రావెల్‌ మార్కెట్‌ (డబ్ల్యుటిఎం)లో ఇరాన్‌ పర్యాటక మేనేజర్‌ తెలిపారు. ఇరాన్‌ పట్ల ఆసక్తి వున్నవారు ట్రంప్‌ వ్యాఖ్యలపై అస్సలు దృష్టి పెట్టడం లేదని అన్నారు. ప్రపంచమంతా పర్యటించేవారు ఇరాన్‌లో కూడా పర్యటించా లను కుంటున్నారని, అలాగే వస్తున్నారని పర్యాటక మేనేజర్‌ ఇబ్రహీం పౌర్ఫారాజ్‌ తెలిపారు. ఇరాన్‌లో పర్యాటకరంగం అభివృద్ధి చెందుతోందని, ఇరాన్‌లో పర్యటిస్తే ఎలాంటి పర్యవసానాలు ఎదురవుతాయనే విషయంలో పర్యాటకులు ఎవరూ కూడా ఆందోళన చెందడం లేదని అన్నారు. ఇరాన్‌కు వచ్చే ముందు విదేశీ పర్యాటకుల కీలకమైన ఆందో ళన భద్రత గురించేనని, ఒక్కసారి ఇరాన్‌ లోకి ప్రవేశిస్తే పరిస్థితి వేరుగా వుంటుందని చెప్పారు. కొద్ది రోజులు వుండాలని వచ్చిన వారు పర్యటనను పొడిగించే పరిస్థితులు కూడా వున్నాయని అన్నారు. 40శాతం పర్యాటక కంపెనీలు అమెరికాతో సం బంధాల పట్ల ఆసక్తి కనపరచడం లేదని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com