'మహానటి' సినిమాలో ఏఎన్నార్ గా అర్జున్ రెడ్డి
- November 08, 2017
అలనాటి మహానటి సావిత్రి జీవిత చరిత్రను వెండి తెరపై 'మహానటి' గా నాగ్ అశ్విన్ ఆవిష్కరిస్తున్నాడు. సావిత్రి పాత్రలో కీర్తి సురేశ్ నటిస్తుండగా.. సమంత కీలక పాత్రలో కనిపించనున్నది. సావిత్రి జీవితంలో ముఖ్య వ్యక్తులను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ నేపద్యంలో అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో యంగ్ హీరో విజయ్ దేవర కొండ కనిపించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు నాగ్ అశ్విన్, విజయ్ దేవర కొండ ఎవడే సుబ్రమణ్యం సినిమా కలిసి చేశారు. ఆ సమయం లో ఇద్దరి మధ్య మంచి స్నేహం నెలకొన్నది అని.. అందుకనే విజయ్ ను నాగేశ్వర రావు పాత్రకు ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల టాక్.. ఎస్పీ రంగారావు పాత్రలో మోహన్ బాబు... సావిత్రి భర్త శివాజీ గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు. కాగా సీ.ఎన్టీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉన్నది. 2018 లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నది.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







