వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
- November 08, 2017
వ్యవసాయ రంగానికి 24 గంటలూ ఉచిత విద్యుత్ అందించడంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. మంగళవారం నుంచే వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే యాసంగి నుంచి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తామని తెలిపారు. 11వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాకు డిస్కంలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. మోటార్లకు పెట్టిన ఆటోస్టార్టర్లను రైతులు వెంటనే తొలగించాలని సీఎం కేసీఆర్ కోరారు.
నోట్ల రద్దు పరిణామాలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం..
నరేంద్రమోదీ సర్కారు డీమానిటైజేషన్ చేపట్టి.. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నోట్ల రద్దు పరిణామాలపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ వాయాదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. స్పీకర్ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. నోట్లరద్దుతో దేశ ఆర్థిక ప్రగతికి తీవ్ర నష్టం వాటిల్లిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల రైతులు, వ్యాపారులు, సామాన్యులు తీవ్రంగా నష్టపోయారని, ఈ విషయంలో కేంద్రానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోరారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







