ఖసబ్‌లో తొలి యాంఫిబియస్ టూరిస్ట్ బస్ ప్రారంభం
- November 08, 2017_1510166256.jpg)
ఖసబ్‌లో పర్యటించే పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు యాంఫిబియస్ బస్ సర్వీస్‌ని ప్రారంభించారు. గోల్డెన్ కోస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ ఈ బస్‌ని ప్రారంభించింది. తొలిసారిగా ఈ సర్వీస్ పర్యాటకులకు అందుబాటులోకి వచ్చింది. గోల్డెన్ కోస్ట్ ట్రావెల్ అండ్ టూరిజం కంపెనీ జిఎం అబ్దుల్ రెహ్మాన్ అహ్మద్ అల్‌ముల్లా మాట్లాడుతూ, యూరోప్ నుంచి ఈ బస్‌ని ఇంపోర్ట్ చేశామని అక్టోబర్ 30 నుంచి ఇది అందుబాటులోకి వచ్చిందని అన్నారు. 90 నిమిషాలపాటు ఈ బస్ ప్రయాణం ఉంటుంది. ఈ బస్ నేల మీదా, సముద్రంలోనూ ప్రయాణిస్తుంది. 34 సీట్లు కెపాసిటీతో ఉండే ఈ బస్ గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపైనా, నీటిలో 7 నాట్స్ వేగంతోనూ ప్రయాణించగలదు. పెద్దలకు 10 ఒమన్ రియాల్స్, పిల్లలకు 5 ఒమన్ రియాల్స్ ఛార్జ్ చేస్తున్నామని ఆయన చెప్పారు. లైఫ్ జాకెట్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్, క్వాలిఫైడ్ టెక్నికల్ స్టాఫ్ ఈ బస్‌లో అందుబాటులో ఉంటారు. ఈ ప్రాజెక్ట్‌ని ఇంప్లిమెంట్ చెయ్యడానికి రెండేళ్ళు పట్టింది.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!