బియ్యం పాయసం
- November 08, 2017
కావలసినవి : బియ్యం - పావు కప్పు, పాలు - రెండున్నర కప్పులు, యాలకులు - 2, కిస్‌మిస్ - 25 గ్రాములు, కుంకుమపువ్వు- చిటికెడు, అలంకరణకు 3 వెండి రేకలు (ఫాయిల్స్)
తయారుచేసే విధానం
బియ్యాన్ని ముందుగా పావుగంట నానబెట్టి పొడిగా ఆరబెట్టాలి. తర్వాత మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దళసరి అడుగున్న పాత్రలో పాలు మరుగుతున్నప్పుడు బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసి, రవ్వ మెత్తబడేదాకా సన్నని సెగపైన ఉడికించాలి. పాయసం అడుగంటకుండా తిప్పుతూ పాలు చిక్కబడ్డాక దింపేయాలి. కొద్ది వేడి పాలల్లో కాసేపు నానబెట్టిన కుంకుమపువ్వుని పాయసంలో కలపాలి. చివర్లో పంచదార వేసి 3 నిమిషాలు ఉంచి దించేయాలి. వెండిరేకలతో అలంకరించి తింటే పాయసం రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి