కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే?
- November 08, 2017వర్షాకాలంలో కప్పు నీటిలో కర్పూరం బిళ్ళలేసి మంచం కింద పెడితే దోమల బెడద తగ్గుతుంది. అలాగే వర్షాకాలం ఇంటిని వేడి నీటిలో శుభ్రపరచయం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. జ్వరం, బలుబు వంటి రుగ్మతలు దరిచేరకుండా వుండాలంటే వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా వుంచుకోవాలి. తడి లేకుండా పొడిబట్టతో ఇంటిని శుభ్రపరుస్తూనే వుండాలి.
ఇక కర్పూరంతో ఈగలు, దోమలు ఇంట్లోకి రానీయకుండా చేయొచ్చు. అర బకెట్ నీళ్ళలో ఒక గుప్పెడు వేపాకు, కర్పూరం వేసి ఆవిరి వచ్చేవరకు మరిగించి ఫ్లోర్‌ను తుడిస్తే క్రిములు నశించడంతో పాటు ఈగలు, దోమలు రావు. వర్షాకాలంలో స్నానం చేసే వేడి నీటిలో కొద్దిగా కర్పూరాన్ని వేసి స్నానం చేస్తే శరీరంపై ఉన్న క్రిములన్నీ చనిపోతాయి.
ఉదయం బ్రష్ చేసేప్పుడు దానిపై కర్పూరం వేసుకుని దంతాలు శుభ్రం చేస్తే నోటి దుర్వాసన పోతుంది. దంతాలకు కీడు చేసే క్రిములు తొలగిపోతాయి. చుండ్రు సమస్య ఉన్నవాళ్ళు కొబ్బరి నూనెలో కర్పూరం వేసి గంట తర్వాత దానిని జుట్టుకు రాసుకుంటే చుండ్రు సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- UPI చెల్లింపులకు దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఆమోదం..!!
- ఇండియాలో ‘ఎమ్మార్’ విక్రయం..అదానీ సహా పలు గ్రూపులతో చర్చలు..!!
- 41వేల నకిలీ పెర్ఫ్యూమ్ బాటిల్స్ స్వాధీనం..!!
- కువైట్ మాజీ అధికారులకు $88 మిలియన్ల జరిమానా..!!
- దుబాయ్, అబుదాబిలో నైట్ వర్క్ పర్మిట్ ఎలా పొందాలి?
- మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. పెట్టుబడి అవకాశాలు..!!
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ దంపతులకు బిగ్‌షాక్..
- ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
- రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన
- ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము