పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'బయటకొచ్చి చూస్తే..' పాట మ్యూజిక్ కర్త ఇతనే...
- November 08, 2017
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌కి తెలుగు సినీ ప్రేక్షకులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , స్టార్ రైటర్ అండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం చిత్రీకరణను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న 25వ సినిమా ఇది కావడం విశేషం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సినిమా జనవరి 10న విడుదల కానుంది.
వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `జల్సా`, `అత్తారింటికి దారేది` సక్సెస్ ను సాధించిన విషయం తెలిసిందే. వీటి తరువాత వచ్చే హ్యాట్రిక్ మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ ఆడియో సంస్థ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. దర్శకుడు త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాలో అనిరుధ్ కంపోజ్ చేసిన పాట `బయటకొచ్చి చూస్తే ...` హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన గంటల్లోనే ఆ లిరికల్ సాంగ్‌కు మిలియన్ వ్యూస్ రావడంతో సెన్సెషన్ గా మారింది. అనిరుధ్ కంపోజిషన్ లో వచ్చే మిగిత పాటల గురించి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







