దుబాయ్‌లో రోడ్డు ప్రమాదాలు: ఒకరి మృతి, 8 మందికి గాయాలు

- November 11, 2017 , by Maagulf
దుబాయ్‌లో రోడ్డు ప్రమాదాలు: ఒకరి మృతి, 8 మందికి గాయాలు

గత వారం కేవలం మూడు రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది గాయాల పాలైనట్లు దుబాయ్‌ ట్రాఫిక్‌ డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. అల్‌ అవీర్‌ ప్రాంతంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయారు. మరో రోడ్డు ప్రమాదంలో ఆరు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇంకో ఘటన దుబాయ్‌ - అల్‌ అయిన్‌ రోడ్డులో జరిగింది. నాలుగు వాహనాలు ఈ ప్రమాదంలో ఇరుక్కున్నాయి. ఇంకో వైపున గడచిన పది నెలల్లో దుబాయ్‌ రోడ్లపై ట్రక్కుల కారణంగా 62 రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మొత్తం 12 మంది చనిపోగా, 82 మందికి గాయాలయ్యాయి ఈ ప్రమాదాల్లో. రోడ్డు నిబంధనలు పాటించకపోవడమే ఈ ప్రమాదాలకు కారణం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com