ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు
- November 13, 2017
దేశ రాజధాని సహా ఉత్తరాదిలో ఆందోళనకరంగా పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీం కోర్టు సోమవారం ఢిల్లీ, యూపీ, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ పరిస్థితి నెలకొందని, సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని సర్వోన్నత న్యాయస్ధానం పేర్కొంది. ఉత్తరాదిలో ఇటీవల కాలుష్యంప్రమాదకరస్ధాయిలకు పెరిగిందని,ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితాలు ఇవ్వడంలేదని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
కాలుష్య సమస్యను అధిగమించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరమని కోర్టు అభిప్రాయపడింది. పారిశ్రామిక సంస్థలు ఫర్నేస్ ఆయిల్ వాడకంపై తమ నిషేధం కేవలం దేశ రాజధాని ప్రాంతానికే పరిమితం కాదని, రాజస్థాన్, యూపీ, హర్యానాలకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకరంగా పెరిగి ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







