జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి దర్శనంపై పరిమితి విధించిన ఎన్‌జీటీ
- November 13, 2017
జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవి పుణ్యక్షేత్రాన్ని దర్శించే భక్తులకు ఇది చేదు వార్తే! ఎందుకంటే ఈ ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్యపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పరిమితి విధించింది. రోజుకు 50 వేల మంది మాత్రమే ఆలయాన్ని సందర్శించాలని స్పష్టం చేసింది. అంతకుమించి వచ్చే భక్తులను అర్ధక్వారీ లేదా కాత్రా వద్ద నిలిపివేయాలని ఆదేశించింది. పుణ్యక్షేత్రం లోపల చేపడుతున్న నూతన నిర్మాణాలను కూడా నిలిపివేయాలని జస్టిస్ స్వాతంత్ర కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం అదేశించింది. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు పాదచారుల కోసం కొత్తగా నిర్మించిన దారిని ఈ నెల24 నుంచి ప్రారంభించవచ్చుననీ.. అయితే ఈ దారిలో బ్యాటరీ కారులు తప్ప గుర్రాలు, గాడిదలకు అనుమతి ఇవ్వరాదని సూచించింది. పాతదారిలో కూడా క్రమంగా ఈ జంతువులను ఉపయోగించకుండా నిరోధించాలని తెలిపింది. కాత్రా సమీపంలోని బస్‌స్టాప్‌లోనూ, ఆలయానికి వెళ్లే దారుల్లోనూ చెత్త పడేసిన వారికి రూ.2 వేల జరిమానా విధించాలని సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







