బీరకాయ తింటున్నారా.. అయితే ఇది ఖచ్చితంగా చదవాల్సిందే....
- November 13, 2017బీరకాయ తెలియని వారు ఉండరు. కానీ దానిలోని ఔషధ గుణాల గురించి చాలా తక్కువమందికి తెలుసు. బీరకాయ కూర, పచ్చడి బాగా ఫేమస్. బీరకాయ మనకు చేసే మేలు అంతాఇంతా కాదు. అసలు బీరకాయ గురించి తెలిస్తే అస్సలు వదలరు.
బీరకాయకు చలువ చేసే గుణం ఉంది. మన ఒంట్లోని అధిక వేడిని తీసివేస్తుంది. అందుకే బీరకాయను పథ్యానికి వాడుతారు. ఇది తింటే ఈజీగా జీర్ణమవుతుంది. మలబద్ధకాన్ని దూరం చేసి సాఫీగా వెళ్ళేట్లుగా దోహదం చేస్తుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్ ఎ-సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియంలు బీరకాయలో ఉన్నాయి. జ్వరం తగిలిన వెంటనే లేత బీర పొట్టు వేపుడు పెడితే చాలా మంచిది. జ్వరం వచ్చినప్పుడు పథ్యం కూరలా వాడతారు. కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది.
ఆల్కహాల్ వల్ల దెబ్బతిన్న కాలేయాన్ని కాపాడుతుంది బీరకాయ. డైరటీ ఫైబర్ అధిక బరువును కూడా తగ్గిస్తుంది. కామెర్ల వ్యాధికి కీలకపాత్ర పోషిస్తుంది బీరకాయ. యాంటి ఇంఫ్లమేటరీగా ఉపయోగపడుతుంది. గుండెజబ్బు రాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తవృద్ధిని కలిగిస్తుంది. రోగనిరోధక శక్తిని కలిగిస్తుంది. రక్తలేమి సమస్య తగ్గిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!