లుక్మి
- November 13, 2017
కావలసిన పదార్థాలు : మైదా - రెండు కప్పులు, ఉప్పు - అర టీస్పూన్, నెయ్యి - నాలుగు టేబుల్‌స్పూన్‌లు, తాజా పెరుగు - పావు కప్పు, గోరు వెచ్చని నీళ్లు - కొన్ని నూనె - వేగించడానికి సరిపడా.
స్టఫ్ కోసం : చికెన్(చిన్నముక్కలు) - పావుకేజీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి(సన్నగా తరిగి), కారం - ఒక టేబుల్‌స్పూన్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా - ఒక్కో టీ స్పూన్ చొప్పున, కొత్తిమీర - కొద్దిగా(సన్నగా తరిగి), నెయ్యి - రెండు టేబుల్ స్పూన్‌లు.
తయారీ : చికెన్‌లో అల్లం వెల్ల్లుల్లి పేస్టు, ఉప్పు వేసి ఉడికించాలి. పాన్‌లో నెయ్యి వేసి ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. తరువాత ఉడికించిన చికెన్ వేసి పసుపు, కారం, ధనియాల పొడి వేసి పొడిగా అయ్యేవరకు వేగించాలి. తరువాత గరంమసాలా, కొత్తిమీర వేసి పాన్ పక్కన పెట్టాలి. మైదా పిండిలో ఉప్పు కలిపి జల్లించాలి. బ్రెడ్ పొడిలా అయ్యేవరకు ఈ మిశ్రమంలో నెయ్యి వేసి రెండు అరచేతులతో రుద్దాలి. తరువాత పెరుగు, గోరువెచ్చని నీళ్లు పోసి మెత్తటి ముద్దలా కలపాలి. చేతికి అతుక్కోకుండా ఈ ముద్ద ఉండాలి. కలిపి పెట్టుకున్న మైదా ముద్దని చిన్నచిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండను పలుచటి చపాతీలా వత్తాలి. వాటిలో ఒక్కో చపాతీ మధ్యలో వేగించిన చికెన్ మిశ్రమాన్ని ఉంచాలి. మరో చపాతీతో చికెన్ ఉంచిన చపాతీని కప్పేయాలి. గట్టిగా చివర్లను వత్తి అతికించాలి. వీటిని స్క్వేర్స్‌గా కోసి ఓ మాదిరి మంట మీద బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి. పేపర్ టవల్ మీద వేస్తే అది నూనె పీల్చేస్తుంది. వీటిని టొమాటో సాస్‌తో తింటే చాలా బాగుంటాయి.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







