జపాన్ ప్రధానితో నరేంద్రమోదీ భేటీ
- November 14, 2017
ఫిలిప్పీన్స్‌లో మూడో రోజు పర్యటనలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీరికలేకుండా గడుపుతున్నారు. ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలతో ఆయన సమావేశమయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ జపాన్ ప్రధానమంత్రి షింజో అబేతో మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు పలు ద్వైపాక్షిక అంశాల గురించి చర్చించారు. గ్లోబల్ పార్టనర్‌షిప్‌పై ఇరు దేశాధినేతలు చర్చించినట్లు తెలుస్తోంది. అంతకుముందు ఆయన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్ టర్నబుల్‌తో భేటీ అయ్యారు.
వాళ్లతో పాటు బ్రూనే సుల్తాన్ హస్సనల్ బోల్కై, న్యూజిలాండ్ ప్రధాని జసిడా ఆండ్రేన్ను మోదీ కలిశారు. ఆగ్నేయాసియా దేశా సంఘం(ఆసియాన్) స్వర్ణోత్సవాల నిమిత్తం మోదీ ఆదివారం ఫిలిప్పీన్స్ వెళ్లిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై మోదీ ట్రంప్‌తో చర్చించారు. వీరిద్దరి భేటీపై శ్వేతసౌధం స్పందించింది.
ట్రంప్ అధ్యక్షతన భారత్‌తో బంధాలు మరింత బలోపేతం కానున్నాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!