అంతరిక్ష వాణిజ్యం లోనూ భారీ పోటీ
- November 14, 2017
భారత్, చైనా మధ్య ఇప్పటికే అనేక అంశాల్లో తీవ్ర పోటీ, ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా మరో ఇరు దేశాల మధ్య మరో హోరాహోరీ పోరుకు రంగం తెర లేచింది. అంతరిక్ష రంగంలో భారత్, చైనాలు తమదైన శైలిలో దూసుకు పోతున్నాయి. ఇదే క్రమంలో ఇరు దేశాలు అంతరిక్ష వాణిజ్యం ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. వాణిజ్య రంగంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చైనాకన్నా అడుగు ముందే ఉంది. ఈ నేపథ్యంలో చైనా అంతరిక్ష వాణిజ్యంలో తమ ధరలను భారీగా తగ్గిస్తూ.. ఇస్రోకు సవాలు విసిరింది. రాకెట్ లాంచింగ్ ప్రోగ్రామ్‌లో ధరలను తగ్గించడం అనేది ఇస్రోను ఆర్థికంగా దెబ్బతీసే అంశం.
చైనా ఏరెస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్పోరేషన్ (సీఏఎస్‌సీ) తీసుకున్న నిర్ణయంపై ఇస్రో ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఇస్రో కూడా ఇదే దారిలో ఉందని.. రాకెట్ లాంచింగ్‌లో ధరలను తగ్గించే ఆలోచన చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇస్రో ఇప్పటికే ఒకేసారి మైక్రో, నానో, మిని, స్టాండర్డ్ శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపి.. ఖర్చును బాగా తగ్గించుకుందని.. ఈ నేపథ్యంలో ధరలను మరింత తగ్గించడం పెద్ద కష్టమేం కాదని ఇస్రో అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం







