ట్రావెల్ ఏజెన్సీలో దొంగతనం: 12 మందికి ట్రయల్
- November 14, 2017
12 మంది సభ్యులు గల ముఠాని దొంగతనం కేసులో ట్రయల్ ముందుంచారు. కత్తులతో బెదిరించి, ట్రావెల్ ఆఫీసులో 14,000 దిర్హామ్‌లు దొంగిలించిన కేసులో వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. ఆసియాకి చెందిన వ్యక్తులు మొహానికి మాస్కులు ధరించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు సాక్ష్యాధారాలతో సహా పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం ముసాఫ్ఫాలోని ఓ ట్రావెల్ ఆఫీసుపై దాడి చేసింది ఈ దొంగల ముఠా. దొంగతనంపై ఆ సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు 12 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కొంత నగదు, అలాగే కొన్ని మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే నిందితులు తమపై వచ్చిన ఆరోపణల్ని ఖండిస్తున్నారు. తదుపరి విచారణ డిసెంబర్‌కి వాయిదా పడింది.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







