ఉల్లికాడలు, పాలు సూప్
- November 14, 2017
కావలసిన పదార్థాలు: ఉల్లి కాడలు - 2 కట్టలు, ఉల్లి తరుగు - పావు కప్పు, తరిగిన వెల్లుల్లి - 2 రేకలు, ఆలివ్ నూనె - 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు - అరకప్పు, నీళ్లు / వెజిటెబుల్ స్టాక్ - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, మెదిపిన మిరియాలు - 1 టీ స్పూను.
తయారుచేసే విధానం: ఉల్లికాడల్ని శుభ్రం చేసి కింద భాగాన్ని, పై భాగాన్ని విడి విడిగా కట్ చేయాలి. ఆలివ్ నూనెలో వెల్లుల్లి, ఉల్లి, కాడల (కింద భాగం) తరుగు ఒకటి తర్వాత ఒకటి దోరగా వేగించాలి. ఇప్పుడు కాడల (పైభాగం) తరుగు వేసి రంగు మారకుండా వేగించి దించేయాలి. చల్లారిన తర్వాత పేస్టులా చేసుకుని పాలు, నీరు/ వెజిటబుల్ స్టాక్‌లతో కలిపి 7 నిమిషాలు మరిగించాలి. ఉప్పు, మిరియాలపొడి కలిపి నేతిలో వేగించిన బ్రెడ్ ముక్కలతో అలంకరించుకుని తాగాలి.
తాజా వార్తలు
- ఓటర్లకు ముఖ్య గమనిక..
- ఉత్తరకాశీ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్..
- తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ కీలక సందేశం
- దుబాయ్ లో శ్రీలంక ఫుడ్ ఫెస్టివల్
- బీమా క్లెయిమ్ కావాలంటే.. కారు ఓనర్లు ఈ తప్పులు చేయకండి
- ఇతరులపై దాడి చేస్తే.. ఏడాది జైలుశిక్ష, 10,000 దిర్హామ్ల జరిమానా
- సౌదీ పర్యాటక ప్రమోషన్.. 277% పెరిగిన బుకింగ్లు
- బీచ్లో బార్బెక్యూలు.. అధికారుల హెచ్చరిక
- నవంబర్ 30న పోలింగ్ రోజు అన్ని ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించాలి: ఎలక్షన్ కమిషన్
- అల్ దఖిలియాలో ఘోర అగ్ని ప్రమాదం..ఒకరు మృతి