షేక్ జాయెద్ వంతెనపై నుంచి యువకుని ఆత్మహత్యయత్నాన్ని అడ్డుకొన్న అబుదాబి పోలీసులు
- November 14, 2017
జీవితం మీద ఏం విరక్తి పుట్టిందో తెలియదు కానీ... ఓ 22 ఏళ్ల ఎమిరాటీ యువకుడు సోమవారం ( నేడు) ఉదయం అబుదాబిలోని షేక్ జాయెద్ వంతెన పై నుంచి కిందకు దూకడం ద్వారా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ యువకుడిని ఆత్మహత్య యత్నం నుంచి విరమింపచేయడంలో అబుదాబి పోలీసులు సఫలీకృతులయ్యారు. ఆ వ్యక్తి వంతెన లోహపు స్తంభాలపై ఎగబాకి అంత ఎత్తు నుంచి కిందకు దహికి తన జీవితాన్ని అంతం చేయటానికి సిద్ధమయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకొని ఎమిరాటీ వ్యక్తితో మాట్లాడి దేవుడిచ్చిన జీవితం విలువ గూర్చి నచ్చచెప్పి తమ వంతుగా ఆ యువకుడు ఎదుర్కొంటున్న పరిస్థితులను కొంతమేరకు తమ వంతు బాధ్యతగా చక్కదిద్దుతామని మాట్లాడుతూ దయచేసి వంతెనను దిగిరావాల్సిందిగా ఎట్టకేలకు పోలీసులు ఒప్పించారు. అయితే మరోవైపు ఆ వ్యక్తి భద్రతను నిర్ధారించడానికి తగిన సురక్షిత చర్యలు చేపట్టారు. అబుదాబి పోలీస్ ఒక ప్రకటనలో వివరిస్తూ, ఆ యువకుడు మానసికంగా అస్థిరంగా ఉన్నాడని ఆ విధమైన పరిస్థితులలో వంతెనను అధిరోహించాడని వెల్లడించారు. తదుపరి చర్య కోసం అతన్ని సమీప పోలీసు స్టేషన్ కు తరలించారు. నేటి ఉదయం ఆ యువకుని కారణంగా షేక్ జాయెద్ వంతెనకు వెళ్లే రహదారులను తాత్కాలిక మూసివేతను ప్రకటించారు,పోలీసులు సమయస్ఫూర్తితో పరిస్థితిని పరిష్కరించారు. యువకుడిని కాపాడిన తర్వాత వంతెనపై ట్రాఫిక్ తిరిగి యధావిధంగా కొనసాగించారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







