షుగర్ వ్యాధి తగ్గాలంటే...

- November 14, 2017 , by Maagulf
షుగర్ వ్యాధి తగ్గాలంటే...

'ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్' అన్నారు మన పెద్దలు. కానీ, ఇపుడది 'ప్రివెన్షన్ ఈజ్ ఎమర్జెన్సీ'గా మారింది. అంటే ముందస్తు నివారణే అత్యవసర చర్యగా మారింది. అయితే, ఇపుడు చక్కెర వ్యాధి అనేది ప్రతి ఒక్కరికీ వచ్చే కామన్ వ్యాధిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మధుమేహం రోగులు ముందుగా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్టయితే ఈ వ్యాధి తీవ్రత పెరగకుండా చూసుకోవచ్చు. 
 
చక్కెర వ్యాధి బారినపడిన వారు కూరగాయలు ఎక్కువగా తినాలి. దీనివల్ల ఆహారంలో ఉండే పీచుపదార్థం ఎక్కువగా ఉండి చక్కెరను నియంత్రిస్తుంది. అంటే కేవలం షుగర్‌ను అదుపులో ఉంచుకోవడం ఒక్కటే కాదు.. ఇలా చేయడం వల్ల అనేక వ్యాధుల బారినపడకుండా తప్పించుకోవచ్చు. 
 
ప్రధానంగా గుండెపోటు, కిడ్నీ ఫెయిల్యూర్, వంటి పెద్దపెద్ద విపత్తులకు దూరంగా ఉండొచ్చు. కనీసం వీటి బారినపడకుండా ఎక్కువకాలం మనుగడ కొనసాగించవచ్చు. అలాగే, సమయానికి సమతుల ఆహారం తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా ఉండొచ్చు. దీంతోపాటు వ్యాయామం, కంటినిండ నిద్ర కూడా తోడైతే మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com