త్రివిక్రమ్ డైరెక్షన్లో డిటెక్టివ్ పాత్రలో ఎన్టీఆర్
- November 14, 2017
జై లవ కుశ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లాంచనంగా ప్రారంభమైన ఈ సినిమా 2018 ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది.ఇన్నాళ్లు ఈ సినిమా త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుందన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబందించి మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
త్రివిక్రమ్ మార్క్ స్టైలిష్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిటెక్టివ్‌గా కనిపించనున్నాడట. 80లలో వచ్చిన ఓ నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే ఆ నవల హక్కులను కూడా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ గత చిత్రం అ..ఆ.. కూడా నవల ఆధారంగా తెరకెక్కిన సినిమానే. దీంతో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కబోయే సినిమా నవల ఆధారంగానే తెరకెక్కనుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







