అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన ఫైర్‌ ఫైటర్స్‌

- November 16, 2017 , by Maagulf
అగ్ని ప్రమాదం: మంటల్ని అదుపు చేసిన ఫైర్‌ ఫైటర్స్‌

షార్జా: షార్జా సివిల్‌ డిఫెన్స్‌ ఫైర్‌ ఫైటర్స్‌ చాకచక్యంగా వ్యవహరించి, భారీ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తెచ్చారు. ఇండస్ట్రియల్‌ ఏరియూలో గురువారం మధ్యాహ్నం పలు వేర్‌ హౌస్‌లలో ఈ అగ్నికీలలు వ్యాపించాయి. జనరల్‌ ట్రేడింగ్‌కి సంబంధించిన ఇండస్ట్రియల్‌ ఏరియా 6 లోని వేర్‌ హౌస్‌లు ఈ అగ్ని ప్రమాదం కారణంగా తగలబడ్డాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సివిల్‌ డిఫెన్స్‌ పేర్కొంది. మధ్యాహ్నం 12.55 నిమిషాల సమయంలో సమాచారం తమకు అందిందనీ, వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు ముమ్మరం చేశామని షార్జా సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ కల్నల్‌ సమి ఖామిస్‌ అల్‌ నక్బి చెప్పారు. మంటల్ని ఇతర వేర్‌ హౌస్‌లకు వ్యాపించకుండా చేయడం, అలాగే మంటల్ని పూర్తిగా అదుపు చేయడంలో ఫైర్‌ ఫైటర్స్‌ సక్సెస్‌ అయ్యారని ఆయన వివరించారు. కూలింగ్‌ ఆపరేషన్స్‌ చేపట్టి, పూర్తిస్థాయిలో ఆ ప్రాంతం సేఫ్‌ అని ఫైర్‌ ఫైటర్స్‌ నిర్ధారించిన అనంతరం, అక్కడ ఘటన ఎలా జరిగిందన్నదానిపై నిపుణుల బృందం తనిఖీలు నిర్వహిస్తుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com