2,700 లిరికా ట్యాబ్లెట్స్‌తో పట్టుబడ్డ మహిళ

- November 16, 2017 , by Maagulf
2,700 లిరికా ట్యాబ్లెట్స్‌తో పట్టుబడ్డ మహిళ

దుబాయ్: ప్రిస్క్రిప్షన్‌ లేకుండా 2,500కి పైగా లిరికా ట్యాబ్లెట్స్‌ని దేశంలోకి తీసుకొచ్చేందుకు ఓ మహిళ ప్రయత్నిస్తుండగా పోలీసులు ఆ యత్నాన్ని భగ్నం చేశారు. ఈ కేసులో 23 ఏళ్ళ లెబనీస్‌ మహిళకు న్యాయస్థానం 2,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది. జులై 2న దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఈ మహిళను అరెస్ట్‌ చేశారు. ట్రామా సమస్యతో ఇబ్బంది పడుతున్న తాను తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం తీసుకొచ్చినట్లుగా నిందితురాలు న్యాయస్థానం యెదుట పేర్కొంది. తన కళ్ళ యెదుటే తన సోదరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అప్పటినుంచి మానసికంగా కుంగిపోయిన తాను ఈ మందుల్ని వాడుతున్నట్లు చెప్పిందామె. అయితే మినిస్ట్రీ ద్వారా అటెస్ట్‌ చేసిన ప్రిస్క్రిప్షన్‌ కుటుంబ సభ్యుల నుంచి తెప్పించగలరా? అని న్యాయస్థానం ప్రశ్నించగా, 'సరే' అని ఒప్పుకున్న నిందితురాలు, ఆ ప్రిస్క్రిప్షన్‌ తీసుకురావడంలో విఫలమవడంతో న్యాయస్థానం నిందితురాలికి శిక్ష ఖరారు చేసింది. ఆమె నుంచి మొత్తం 2,744 ట్యాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. లిరికా అనే ఈ ట్యాబెట్లను యూఏఈ నిషేధించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com