గుడ్డు కాకర పొరటు
- November 16, 2017
కావలసిన పదార్థాలు: కాకరకాయ (చిన్నది) - 1, గుడ్లు - 5, ఉల్లి తరుగు - 2 టీ స్పూన్లు, పండు మిర్చి తరుగు - 1 టీ స్పూను, (పల్చటి) సోయాసాస్ - 1 టీ స్పూను, ఉప్పు, మిరియాలపొడి - రుచికి తగినంత, వేరుశనగ నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం: కాకరకాయని సన్నగా తరిగి, గింజలు తీసి ఉప్పు నీటిలో 10 నిమిషాలు ఉంచి, నీటిని వార్చేసి ఆరబెట్టాలి. గుడ్ల సొనలో సోయాసాస్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా గిలకొట్టి పక్కనుంచాలి. కడాయిలో కాకర, ఉల్లి, పండుమిర్చి తరుగులు ఒకదాని తర్వాత ఒకటి వేగించి గుడ్ల మిశ్రమం కలపాలి. ఎక్కువసేపు వేగించకుండా దించేసి వేడివేడిగా అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం