ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...

- November 16, 2017 , by Maagulf
ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరాన్నితాకితే...

చాలామంది ఉదయాన్నే నిద్రలేవడం ఎంతో కష్టంగా భావిస్తుంటారు. రాత్రిసమయంలో ఎంత ఆలస్యంగానైనా పడుకుంటారు కానీ, ఉదయాన్నే నిద్రలేవడం మాత్రం ససేమిరా అంటారు. మరి అలాంటప్పుడు ఉత్సాహవంతమైన ఉదయానికి స్వాగతం పలకడానికి ఏం చేయాలి.
 
నిజానికి సూర్యోదయం కంటే ముందు నిద్రలేవడం వల్ల ఆ రోజంతా ఎంతో హుషారుగా ఉంటారు. కానీ, అలా నిద్రలేవడమే చాలా కష్టంగా భావిస్తుంటారు. నిద్ర నుండి బయటపడలేక, ఆ బద్దకాన్ని వదల్లేక ఇబ్బందులు పడుతుంటారు.
 
అలాగే, ఉదయాన్నే సూర్యకిరణాలు శరీరంపై పడటం వల్ల నిద్ర మత్తు వదిలిపోతుంది. పైగా, శరీరం నూతనోత్సాహాన్ని పొందుతుంది. అంతేకాదు శరీరానికి సహజసిద్ధమైన శక్తి అందుతుంది. 
 
నిద్రలేవగానే కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత జాగింగ్‌, వాకింగ్‌లాంటివి చేయడం వల్ల శరీరం ఉత్సాహంగా ఉంటుంది. నిద్రలేవగానే గ్లాసు మంచినీళ్ళు తాగాలి. దీనివల్ల డీహైడ్రేషన్‌ కాకుండా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.
 
రాత్రిపూట టీవీ ఎక్కువసేపు చూడటం వల్ల రాత్రంతా నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది. పడుకునేముందు టీవీ చూడటం వల్ల ఆ వెలుతురు కళ్ళపై ప్రభావం చూపుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com