నాసా సంచలనం..మునిగేది మన ఊరే!
- November 16, 2017
వాషింగ్టన్ : గ్లోబల్ వార్మింగ్ మూలంగా ధ్రువాలలోని మంచు ఫలకాలు కరిగిపోయి తీర ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాసా పరిశోధనలో తేలిన సంచలన విషయం ఏంటంటే... ఆ ప్రభావం ఎక్కువగా చూపించబోయేది మన నగరంపైనేనంటా.
గ్రెడియంట్ ఫింగర్‌ప్రింట్ మ్యాపింగ్(జీఎఫ్‌ఎం) పేరిట ఈ మధ్యే నాసా ఓ కొత్త పరికరాన్ని కనిపెట్టింది. దాని ద్వారా ఏయే ప్రాంతాల్లో ముంపు ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని అంచనా వేస్తోంది. గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలో మంచు శిలలు కరిగిపోతే న్యూయార్క్, లండన్, ముంబై లాంటి మహానగరాలలో వాటిల్లే ముప్పు కంటే మంగళూర్‌కే ముంపు తీవ్రత ఎక్కువగా పొంచి ఉందంట. సుమారు 293 పోర్టు పట్ణణాలను పరిశోధించిన నాసా ఈ నివేదికను విడుదల చేసింది. వీటితోపాటు కరాచీ, చిట్టాగాంగ్, కొలంబో పట్టణాలకు కూడా మునిగిపోయే ప్రమాదం ఉందని నాసా హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







