దుబాయి పెళ్లిళ్లు: సర్వేలో ఇలా!
- November 20, 2017
దుబాయి: దుబాయి పెళ్లిళ్ల గురించి పలు ఆసక్తికర విషయాలు ఓ సర్వే ద్వారా వెల్లడయ్యాయి. 2016సంవత్సరంలో జరిగిన పెళ్లిళ్లపై సర్వే చేయగా ఈ విషయాలు వెల్లడైనట్టు సమాచారం.
2016లో మార్చి నెలలోనే ఎక్కువగా పెళ్లిళ్లు జరిగాయని, ఆశ్చర్యంగా అదే నెలలో ఎక్కువమంది విడాకులు కూడా తీసుకున్నారని తేలింది. 2016లొ యూఏఈలో మొత్తం 5892పెళ్లిళ్లు జరగ్గా.. వీటిలో 70.9శాతం పెళ్లిళ్లు దుబాయి పౌరుడు/పౌరురాలు-వలసదారులకు మధ్య జరిగినవేనట.
దుబాయికి వలస వచ్చేవారితో అక్కడివారి వివాహాల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. ఇక వయసు విషయానికొస్తే.. పురుషులు 27.2సంవత్సరాలకు పెళ్లిళ్లు చేసుకుంటుంటే.. స్త్రీలు 24.2 సంవత్సరాలు వివాహం చేసుకుంటున్నారట.
గతేడాది జూన్ నెలలో అతి తక్కువ పెళ్లిళ్లు నమోదయ్యాయని సర్వేలో తేలింది. అలాగే గతేడాది 1922విడాకుల కేసులు నమోదైనట్టు స్పష్టం చేసింది
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష