కలిసి ముందడుగు వేద్దాం: చర్చలకు ఖతార్ పిలుపు
- November 20, 2017
ఖతార్: ఖతార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫారిన్ ఎఫైర్స్ సుల్తాన్ బిన్ సాద్ అల్ మురైఖి మాట్లాడుతూ, అరబ్ నేషన్‌కి సంబంధించి రాజకీయ, ఆర్థిక, భద్రత వంటి విషయాల్లో అందరం కలిసి ముందడుగు వేయాల్సి ఉందని అన్నారు. అరబ్ దేశాల్లో గత కొంతకాలంగా నెలకొన్న దురదృష్టకర వాతావరణం మారిపోవాల్సి ఉందనీ, సమస్యలేవైనా ఉంటే చర్చించి, పరిష్కారం కనుగొనాలని ఆయన పిలుపునిచ్చారు. కైరోలోని అరబ్ లీగ్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యల చేశారు. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావం అరబ్ దేశాలపై తీవ్రంగా పడితే, దాన్ని అరబ్ దేశాలన్నీ సంయుక్తంగా ఎదుర్కొనాల్సి ఉంటుందనీ, దానికి అందరం కలిసి పనిచేయాల్సి ఉందని, పరస్పర చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకుంటే సమస్యను సంఘటితంగా ఎదుర్కోవడం తేలికని చెప్పారు. రియాద్‌పై ఇటీవల జరిగిన మిస్సైల్ ఎటాక్‌ని మురైకి, ఖతార్ తరఫున తీవ్రంగా ఖండించారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!