హెల్త్ కేర్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న హెచ్‌ఎంసి
- November 20, 2017
హమాద్ మెడికల్ కార్పొరేషన్ (హెచ్‌ఎంసి), హెల్త్‌కేర్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ సొసైటీ (హెచ్‌ఐఎమ్‌ఎస్‌ఎస్)తో కలిసి హెచ్‌ఐఎంఎస్‌ఎస్ ఖతార్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అండ్ హెల్త్ ఐటీ ఎగ్జిబిషన్‌ని సంయుక్తంగా నిర్వహించనుంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు షెరటాన్ రగాండ్ దోహా రిసార్ట్ అండ్ కన్వెన్షన్ హాల్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్, సిడ్రా మెడిసిన్ నేతృత్వంలో ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నారు. హెల్త్‌కేర్ ప్రొఫెషనల్స్‌కి ఈ ఈవెంట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని హెచ్‌ఎంసి క్లినికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అబ్దుల్ వాహబ్ అల్ ముస్లెహ్ చెప్పారు. 1961లో ఏర్పాటైన హెచ్‌ఐఎంఎస్‌ఎస్, హెల్త్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగంలో ఐటీ వినియోగం ద్వారా తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఇన్నోవేషన్, కొలాబరేషన్, ఎడ్యుకేషన్ - ఐటీ - హెల్త్ సెక్టార్ వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేకమైన చర్చ ఈ ఈవెంట్‌లో జరగనుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!