పాయా నిహారీ

- November 20, 2017 , by Maagulf
పాయా నిహారీ

కావాల్సినవి
 
పాయ(పొట్టేలు కాళ్లు) - ఎనిమిది, ఉల్లిపాయలు - నాలుగు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒకటిన్నర టేబుల్‌ స్పూన్‌, వెల్లుల్లి రెబ్బలు - ఆరు, బిర్యానీ ఆకు - ఒకటి, పొట్లీ కా మసాలా(రెడీమేడ్‌) - ఒక ప్యాకెట్‌, కారం - ఒక టేబుల్‌ స్పూన్‌, పసుపు - అర టీ స్పూన్‌, గోధుమ పిండి - ఐదు టేబుల్‌ స్పూన్‌లు, కొత్తిమీర కట్ట - ఒకటి, పుదీనా - ఒక కట్ట, ఉప్పు - తగినంత, నెయ్యి - ఒక టేబుల్‌ స్పూన్‌, నూనె - ఒక కప్పు.
 
తయారివిధానం
 
పాయను శుభ్రంగా కడిగి కుక్కర్‌లో వేయాలి. దాంతోపాటు నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి, బిర్యానీ ఆకు, పొట్లీ కా మసాలా, కారం, పసుపు, ఉప్పు, మూడు కప్పుల నీళ్లు, ఉల్లిపాయ తరుగు వేసి ఉడికించాలి. పెద్దమంటపై మూడు విజిల్స్‌ వచ్చాక, చిన్నమంటపై గంటన్నర పాటు ఉడికించాలి. ఆవిరి పోయాక కుక్కర్‌ మూత తీసి కొత్తిమీర, పుదీనా వేయాలి. ఆరు కప్పుల నీళ్లు పోసి కాసేపు ఉడికించాలి. ఉల్లిపాయలు, కొత్తిమీర వేగించి పాయని గార్నిష్‌ చేస్తే పాయ రెడీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com